BCA: ఫిబ్రవరి 8వ తేదీతో ముగియనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు

  • 2 నుంచి 4 వరకు సెలవులు
  • సమావేశం తేదీలు, చర్చించే అంశాలు ఖరారు చేసిన బీఏసీ
  • 5న ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ పెట్టనున్న యనమల

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలు ఫిబ్రవరి 8వ తేదీతో ముగియనున్నాయి. ఈ మేరకు బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి ఒకటిని విభజన సమస్యలు, ప్రత్యేక హోదా అంశాలపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించనున్నారు. 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు సెలవు ప్రకటించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు 5వ తేదీన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. 6వ తేదీన గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపేందుకు చర్చ సాగుతుంది. 7వ తేదీన సంక్షేమం, ఇతర శాఖలపై చర్చిస్తారు. ఎనిమిదవ తేదీన విజన్‌ డాక్యుమెంట్‌పై చర్చిస్తారు. దీంతో సమావేశాలు ముగుస్తాయి.

BCA
ap assembly sessions
  • Loading...

More Telugu News