panchayat pols: పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసి కుప్పకూలిన మహిళ...గుండెపోటుతో మృతి

  • ఘటనా స్థలిలోనే అంతిమశ్వాసతో అపశ్రుతి 
  • వికారాబాద్‌ జిల్లా మిట్ట కోడూరులో ఘటన
  • పోలింగ్‌కు అంతరాయం లేకుండా చర్యలు

తెలంగాణలో జరుగుతున్న మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చిన ఓ మహిళ అక్కడే ప్రాణాలు కోల్పోయింది. వికారాబాద్‌ జిల్లా పరిగి మండలం మిట్టకోడూరు పోలింగ్‌ కేంద్రంలో ఈ రోజు ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని పోలింగ్‌ కేంద్రానికి వెళ్లిన ఆమె ఓటు వేసి బయటకు వచ్చాక ఛాతిలో నొప్పిరావడంతో కుప్పకూలిపోయింది. ఈ హఠాత్పరిణామంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను పైకిలేపేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్టు గుర్తించారు. ఎన్నికల వేళ జరిగిన అపశ్రుతితో కాసేపు అంతా నిశ్చేష్టులైపోయారు. అయితే పోలింగ్‌కు ఎటువంటి అంతరాయం కలగకుండా అవసరమైన చర్యలు అధికారులు చేపట్టడంతో పోలింగ్‌ సజావుగా సాగుతోంది.

panchayat pols
lady vter die
heart attack
  • Loading...

More Telugu News