Kanna Lakshminarayana: చంద్రబాబు గారు... మీరు క్యా 'కియా'?: కన్నా ఎద్దేవా

  • కియా రావడానికి కారణం నరేంద్ర మోదీ
  • కాదని చెప్పగలవా చంద్రబాబూ
  • ట్విట్టర్ వేదికగా కన్నా ప్రశ్నలు

ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాకు కియా కార్ల పరిశ్రమ తరలిరావడానికి కారణం ప్రధాని నరేంద్ర మోదీయేనని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. కేవలం ప్రచారం కోసమే చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని ఎద్దేవా చేస్తూ, తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు.

"మీరు క్యా'కియా'? ఏపీకి కియా ప్లాంట్ రావడానికి కారణం మోదీ గారు.. కాదని మీరు పబ్లిక్ గా చెప్పగలరా? మీరు కియా పేరుతో కేంద్రం కృషిని హైజాక్ 'కియా'! కియా పేరుతో అవినీతి 'కియా'! కియా పేరుతో పబ్లిసిటీ 'కియా'! కియా పేరుతో భూ-మాఫియా కు సపోర్ట్ 'కియా'! అంటూ విమర్శలు గుప్పించారు.

Kanna Lakshminarayana
KIA
Anantapur District
  • Error fetching data: Network response was not ok

More Telugu News