Aamir Khan: ఆమిర్ ఖాన్, నసీరుద్దీన్ షాలపై బీజేపీ, ఆరెస్సెస్ నేతల తీవ్ర విమర్శలు

  • ఆమిర్, నసీరుద్దీన్ షాలు మంచి నటులే కావచ్చు
  • దేశద్రోహులు కావడం వల్ల వారు ఆ గౌరవానికి అనర్హులు
  • వీరిద్దరూ మీర్ జాఫర్, జైచంద్ లాంటివారు

ప్రముఖ బాలీవుడ్ నటులు ఆమిర్ ఖాన్, నసీరుద్దీన్ షాలపై ఆరెస్సెస్ కీలక నేత ఇంద్రేష్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరూ దేశద్రోహులంటూ వ్యాఖ్యానించారు. 'ఆమిర్, నసీరుద్దీన్ లు మంచి నటులే కావచ్చు. కానీ, దేశద్రోహులు కావడం వల్ల వారు ఆ గౌరవానికి అనర్హులు. వీరిద్దరూ మీర్ జాఫర్, జైచంద్ లాంటి వారు' అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ సిద్దూ కూడా ఇలాంటివారేనని చెప్పారు.

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంలాంటి ముస్లింలు దేశానికి కావాలని... కసబ్, యాకూబ్, ఇష్రత్ జహాన్ లాంటి టెర్రరిస్టులు అవసరం లేదని ఇంద్రేష్ కుమార్ అన్నారు. కలాం అడుగుజాడల్లో నడిచిన ముస్లింలు దేశానికి అవసరమని... కసబ్ దారిలో నడిచేవారంతా దేశద్రోహులేనని చెప్పారు. కాంగ్రెస్, వామపక్షాలు, మత శక్తులు, కొందరు న్యాయమూర్తుల వల్లే అయోధ్య కేసు విచారణ ఆలస్యమవుతుతోందని మండిపడ్డారు.

మరోవైపు, ఉత్తరప్రదేశ్ బీజేపీ చీఫ్ మహేంద్రనాథ్ పాండే మాట్లాడుతూ, నసీరుద్దీన్ షా ఒక సినిమాలో పాక్తిస్తాన్ ఏజెంట్ గా నటించారని... ఇప్పుడు నిజ జీవితంలో కూడా అలాగే తయారవుతున్నారని విమర్శించారు.

Aamir Khan
nasiruddin shah
bollywood
traitors
indresh kumar
mahendranath pandey
bjp
rss
  • Loading...

More Telugu News