East Godavari District: ముద్రగడ ‘చలో కత్తిపూడి’ సభకు అనుమతి లేదన్న పోలీసులు.. తూర్పు గోదావరిలో టెన్షన్ టెన్షన్!

  • ఈ నెల 31న ‘చలో కత్తిపూడి’ సభకు ముద్రగడ పిలుపు
  • అనుమతి కోరితే పరిశీలిస్తామన్న ఎస్పీ
  • కిర్లంపూడిలో పోలీసుల బందోబస్తు

కాపు నేత ముద్రగడ పద్మనాభం పిలుపు ఇచ్చిన ‘చలో కత్తిపూడి’ సభకు అనుమతి లేదని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ విశాల్ గున్ని తెలిపారు. అనుమతులు లేకుండా సభ నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమతి లేకుండా జరిగే సభలకు వెళ్లి ఇబ్బందుల పాలు కావొద్దంటూ ప్రజలకు సూచించారు. మరోవైపు, ముద్రగడ పిలుపుతో జిల్లాలో మరోమారు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అప్రమత్తమైన పోలీసులు ముద్రగడ స్వగ్రామమైన కిర్లంపూడిలో రెండు రోజులుగా బందోబస్తు నిర్వహిస్తున్నారు.

ఈ నెల 31న ముద్రగడ చేపట్టనున్న ‘చలో కత్తిపూడి’ సభకు ఆయన ఎటువంటి అనుమతులు తీసుకోలేదని, ఒకవేళ కోరితే పరిశీలిస్తామని ఎస్పీ తెలిపారు. సోమవారం కిర్లంపూడిలో ఆకస్మికంగా పర్యటించిన ఆయన పరిస్థితిని సమీక్షించారు. ఇటీవల వైఎస్ జగన్, పవన్ కల్యాణ్ నిర్వహించిన సభలకు పోలీసుల అనుమతులు ఉన్నాయని ఎస్పీ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News