Andhra Pradesh: ఏపీ ప్రజలు అగ్నిగుండంలా రగులుతున్నారు.. బీజేపీ, వైసీపీలు మాడి మసైపోతాయ్!: మంత్రి నారాయణ హెచ్చరిక

  • జగన్ ఏపీని మోదీకి తాకట్టు పెట్టారు
  • బీజేపీ-వైసీపీ మధ్య లాలూచీ ఉంది
  • నెల్లూరులో మాట్లాడిన టీడీపీ నేత

కేసుల మాఫీ కోసం వైసీపీ అధినేత జగన్ రాష్ట్రాన్ని మోదీ కాళ్లదగ్గర తాకట్టు పెట్టారని ఏపీ మంత్రి నారాయణ విమర్శించారు. ఏపీకి తీవ్ర అన్యాయం చేస్తున్న మోదీతో ఆయన చేతులు కలిపారని దుయ్యబట్టారు. ఇప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీలో, ఆయన భార్య పురందేశ్వరి బీజేపీలో కొనసాగడం ఇరుపార్టీల మధ్య లాలూచీకి నిదర్శనమని మండిపడ్డారు.

నెల్లూరులో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ చేసిన ద్రోహంపై ఏపీ ప్రజలు అగ్నిగుండంలా రగిలిపోతున్నారని తెలిపారు. వైసీపీ, బీజేపీలు ఆ ఆగ్నిగుండంలో మాడి మసైపోవడం ఖాయమని స్పష్టం చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ భారీ మెజారిటీతో మరోసారి అధికారంలోకి రాబోతోందని జోస్యం చెప్పారు.

Andhra Pradesh
YSRCP
Telugudesam
Nellore District
BJP
Jagan
daggubati
criticise
  • Loading...

More Telugu News