ysr district: వైఎస్సార్‌ కడప జిల్లాలో కలకలం...తెల్లవారు జామున నాలుగేళ్ల బాలిక కిడ్నాప్‌

  • ఇంట్లో ఉన్న బాలికను ఎత్తుకెళ్లిన దుండగులు
  • నందూరు పట్టణంలో ఘటన
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు

ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్సార్‌ కడప జిల్లాలో నాలుగేళ్ల బాలిక కిడ్నాప్‌ వ్యవహారం కలకలం సృష్టించింది. జిల్లాలోని నందూరు పట్టణంలోని దిగువ వీధిలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. వీరికి నాలుగేళ్ల పాప జైనాబ్‌ ఉంది. సోమవారం తెల్లవారు జామున గుర్తు తెలియని వ్యక్తులు జైనాబ్‌ ఇంటికి వచ్చి పాపను ఎత్తుకు వెళ్లారు. ఈ హఠాత్పరిణామంతో బిత్తరపోయిన తల్లిదండ్రులు లబోదిబోమన్నా అప్పటికే దుండగులు మాయమయ్యారు. బాలిక తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అసలు దుండగులు ఎవరు, బాలికను ఎందుకు కిడ్నాప్ చేశారన్నది తెలియరాలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు.

ysr district
girl kidnap
  • Loading...

More Telugu News