Karnataka: మీ వాళ్లను అదుపులో పెట్టుకోండి.. లేదంటే సీఎం పదవికి రాజీనామా చేస్తా!: కాంగ్రెస్ కు కుమారస్వామి వార్నింగ్

  • కాంగ్రెస్ నేతలు హద్దులు దాటి వ్యవహరిస్తున్నారు
  • పార్టీ సీనియర్ నేతలు రంగంలోకి దిగాలి
  • మీడియాతో మాట్లాడిన కర్ణాటక సీఎం

కర్ణాటక ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత హెచ్.డి.కుమారస్వామి కాంగ్రెస్ పార్టీ నేతలపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నేతలు హద్దులు దాటి వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆ పార్టీ సీనియర్ నేతలు పరిస్థితిని చక్కదిద్దాలని సూచించారు. లేదంటే తాను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటానని హెచ్చరించారు.

బెంగళూరులో ఈరోజు మీడియాతో మాట్లాడిన కుమారస్వామి.. కాంగ్రెస్ నేతలు వీధుల్లోకి ఎక్కి కొట్టుకుంటే వారికే నష్టమనీ, తనకు ఎలాంటి ఇబ్బంది లేదని వ్యాఖ్యానించారు. ఇటీవల బెంగళూరు శివార్లలోని ఈగల్ టన్ రిసార్టులో కాంగ్రెస్ ఎమ్మెల్యే గణేశ్, తోటి ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ పై దాడి చేసిన సంగతి తెలిసిందే. అలాగే పలువురు కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరేందుకు రహస్యంగా చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కుమారస్వామి ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

Karnataka
Chief Minister
kumaraswamy
Congress
jds
warning
  • Loading...

More Telugu News