Madhya Pradesh: మరణాన్ని జయించిన చిన్నారి.. బోరు బావిలో పడిన బాలుడు క్షేమంగా బయటికి!

  • ఆడుకుంటూ వెళ్లి బావిలో పడిన చిన్నారి
  • బావికి సమాంతరంగా రంధ్రం
  • బాలుడి శరీరంపై చిన్న గీత కూడా పడని వైనం

ఆడుకుంటూ వెళ్లి 70 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయిన రెండేళ్ల చిన్నారి మృత్యువును జయించాడు. మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలి జిల్లా కెర్హర్‌లో ఆదివారం ఉదయం బాలుడు తేజ్ ప్రతాప్ ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడిపోయాడు. సమాచారం అందుకున్న అధికారులు, సహాయక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బావికి సమాంతరంగా మరో రంధ్రాన్ని తవ్వి చిన్నారిని క్షేమంగా బయటకు తీశారు. వెంటనే బాలుడిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

బాలుడి శరీరంపై చిన్న గీత కూడా పడలేదని, క్షేమంగా ఉన్నాడని అధికారులు తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించనున్నట్టు చెప్పారు. అనుమతులు లేకుండా బోరుబావి తవ్విన యజమానిపై కేసు నమోదు చేయనున్నట్టు పోలీసులు తెలిపారు.

Madhya Pradesh
Borewell
Boy
Police
Tej pratap
  • Loading...

More Telugu News