anant kumar hegde: తాజ్ మహల్ ను ముస్లింలు నిర్మించలేదు.. జయసింహ అనే రాజు నుంచి కొనుగోలు చేశారు: అనంత్ కుమార్ హెగ్డే

  • పరమతీర్థ నిర్మించిన శివాలయాన్ని తేజోమహల్ అని పిలిచేవారు
  • ఆ తర్వాత పేరును తాజ్ మహల్ గా మార్చారు
  • ఇలాగే ఉంటే మన ఇళ్లను కూడా మసీదులుగా మార్చుతారు

ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్ మహల్ పై కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజ్ మహల్ ను ముస్లింలు నిర్మించలేదని...జయసింహ అనే రాజు వద్దనుంచి కొనుగోలు చేసినట్టు షాజహాన్ తన ఆత్మకథలో చెప్పాడని తెలిపారు. పరమతీర్థ అనే రాజు నిర్మించిన శివాలయాన్ని తేజోమహల్ అని పిలిచేవారని... తదనంతర కాలంలో దాని పేరును తాజ్ మహల్ గా మార్చారని చెప్పారు. మనం ఇలాగే నిద్రపోతూ ఉంటే మన ఇళ్ల పేర్లను కూడా మసీదులుగా మార్చుతారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాముడిని జహాపన అని, సీతాదేవిని బీబీ అని పిలుస్తారని అన్నారు. చరిత్రను కూడా వక్రీకరిస్తూ తిరగరాశారని ఆరోపించారు. 

anant kumar hegde
bjp
taj mahal
  • Loading...

More Telugu News