ram gopal varma: బీజేపీలో చేరిన బాలీవుడ్ భామ

  • నితిన్ గడ్కరీ సమక్షంలో బీజేపీలో చేరిన ఇషా కొప్పికర్
  • 2002లో 'కంపెనీ' చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ
  • దక్షిణాది భాషల్లో కూడా నటించిన ఇషా

బాలీవుడ్ నటి ఇషా కొప్పికర్ బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సమక్షంలో ఆమె బీజేపీ కండువా కప్పుకున్నారు. వెంటనే ఆమెను బీజేపీ విమెన్ ట్రాన్స్ పోర్ట్ వింగ్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. 2002లో ఇషా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'కంపెనీ' చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. తెలుగు, తమిళం, మరాఠీ, కన్నడ చిత్రాలలో కూడా నటించారు. తెలుగులో చంద్రలేఖ, ప్రేమతో రా, కేశవ చిత్రాల్లో కనిపించారు. 2009లో వ్యాపారవేత్త టిమ్మీ నారంగ్ ను ఆమె పెళ్లాడారు. వీరికి ఐదేళ్ల పాప ఉంది.

ram gopal varma
isha koppikar
bjp
nitin gadkari
  • Loading...

More Telugu News