nara lokesh: బీసీలకు ఎన్ని పదవులు ఇచ్చారో జగన్ చెప్పాలి: నారా లోకేష్

  • బీసీలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకున్న ఘనత టీడీపీదే
  • ఎన్నో పథకాల ద్వారా ప్రజల కష్టాలను తీరుస్తున్నాం
  • చంద్రబాబు స్పీడును అందుకోవడం ఎవరి వల్ల కాదు

బీసీలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకున్న ఘనత టీడీపీదని మంత్రి నారా లోకేష్ అన్నారు. రాజమండ్రిలో జరుగుతున్న జయహో బీసీ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా రూ. 24 వేల కోట్ల రైతు రుణమాఫీ చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదని చెప్పారు. డ్వాక్రా గ్రూపులోని ప్రతి మహిళకు పసుపుకుంకుమ పథకం కింద రూ. 10 వేలు ఇస్తున్నామని తెలిపారు. రూ. 200 పెన్షన్ ను రూ. 2 వేలకు పెంచామని చెప్పారు. చంద్రన్న బీమా, చంద్రన్న పెళ్లికానుక, నిరుద్యోగ భృతి, క్రిస్మస్ తోఫా, రంజాన్ తోఫా, సంక్రాంతి కానుకల ద్వారా ప్రజల కష్టాలను తీరుస్తున్నారని తెలిపారు. అన్నా క్యాంటీన్ల ద్వారా పేదల ఆకలి తీర్చుతున్నారని చెప్పారు.

రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు, పంచాయతీ కార్యాలయాలను నిర్మించామని లోకేష్ తెలిపారు. 2020 నాటికి ప్రతి ఇంటికీ నీటి కుళాయి రాబోతోందని చెప్పారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేసినప్పుడు పోలవరం ప్రాజెక్టు 7 శాతం మాత్రమే పూర్తయిందని... త్వరలోనే పోలవరం నీరు ప్రజలకు అందబోతోందని తెలిపారు. బీసీలకు పెద్దపీట వేసింది చంద్రబాబేనని చెప్పారు. విపక్ష నేత జగన్ ఆయన పార్టీలో బీసీలకు ఎన్ని పదవులు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. 68 ఏళ్ల వయసులో కూడా చంద్రబాబు 20 ఏళ్ల వయసు వారిలా పని చేస్తున్నారని చెప్పారు. ఆయన స్పీడ్ ను అందుకోవడం ఎవరి తరం కాదని అన్నారు. 

  • Loading...

More Telugu News