Andhra Pradesh: టీడీపీ ’జయహో బీసీ’ అంటే నమ్మేవాళ్లు ఎవ్వరూ లేరు!: బీజేపీ నేత జీవీఎల్

  • నాలుగున్నరేళ్ల పాటు మోసం చేశారు
  • ఆదరణ పథకంతో అవినీతికి పాల్పడ్డారు
  • ట్విట్టర్ లో టీడీపీపై మండిపడ్డ బీజేపీ నేత

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ప్రభుత్వంపై బీజేపీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శలు గుప్పించారు. నాలుగున్నరేళ్ల పాటు మోసం చేసిన టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు ‘జయహో బీసీ’ అంటే నమ్మేవారు ఎవ్వరూ లేరని వ్యాఖ్యానించారు. ఆదరణ పథకంలో అవినీతి చేశారని దుయ్యబట్టారు. బీసీలకు కేంద్రం కేటాయించిన, ఏపీ బడ్జెట్ లో ఇచ్చిన నిధులను కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టలేదని ఆరోపించారు.

ఈరోజు ట్విట్టర్ లో జీవీఎల్ స్పందిస్తూ.. ‘4 1/2 ఏళ్ల నుంచి వంచించిన తెలుగు దేశం ప్రభుత్వం ఎన్నికల ముందు "జయహో బీసీ" అంటే నమ్మే అమాయకులు లేరు.'ఆదరణ' పేరుతో అవినీతి చేశారు. రాజకీయ ప్రాధాన్యత లేదు. బీసీలు హైకోర్ట్ జడ్జీలుగా పనికిరారని సీఎం కుట్ర చేశారు. కేంద్ర, రాష్ట్ర నిధులను కూడా ఖర్చు చేయని ప్రభుత్వం’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు బీసీలపై ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రికలో ప్రచురితమైన ఓ కథనం లింక్ ను జతచేశారు. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో ఈరోజు జయహో బీసీ సభను టీడీపీ నిర్వహించనున్న సంగతి తెలిసిందే.

Andhra Pradesh
Telugudesam
BJP
gvl narasimha rao
Twitter
criticise
  • Loading...

More Telugu News