priyanka gandhi: ప్రియాంకాగాంధీకి ఓ మానసిక ఆరోగ్య సమస్య ఉంది: సుబ్రహ్మణ్యస్వామి

  • ఆమె బైపోలార్ డిజార్డర్ తో బాధపడుతున్నారు
  • ఈ వ్యాధి ఉన్నవారు ప్రజా జీవితంలో పని చేయలేరు
  • తీవ్ర భావోద్వేగానికి గురి కావడం లేదా కుంగిపోవటం చేస్తారు

ప్రత్యక్షరాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్న ప్రియాంకాగాంధీకి అప్పుడే బీజేపీ నేతల నుంచి విమర్శల దాడి ప్రారంభమైంది. బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి ఆమెపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక బైపోలార్ డిజార్డర్ అనే మానసిక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారని... ఈ వ్యాధి ఉన్నవారు ప్రజా జీవితంలో పని చేయలేరని చెప్పారు.

ఈ రుగ్మత ఉన్నవారిలో మానసిక ఉద్వేగాలు చాలా తక్కువగా ఉంటాయని అన్నారు. సంతోషం మరీ ఎక్కువైతే తీవ్ర భావోద్వేగానికి లోను కావడం... బాధగా ఉన్పప్పుడు తీవ్రంగా కుంగిపోవడం వంటివి చేస్తారని చెప్పారు. ప్రియాంకను తూర్పు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ఇన్ ఛార్జిగా నియమించిన సంగతి తెలిసిందే. 

priyanka gandhi
subrahmanian swamy
congress
bjp
  • Loading...

More Telugu News