Narendra Modi: అత్యుత్తమ మంత్రిగా రాజ్‌నాథ్‌సింగ్‌.. 'ఇండియా టుడే' సర్వేలో వెల్లడి

  • సర్వేలో పాల్గొన్న 13 వేల మంది 
  • సుష్మ, అరుణ్ జైట్లీ, గడ్కరి, నిర్మలకు తర్వాత స్థానాలు
  • ఆపదలో ఆదుకుంటారని సుష్మాస్వరాజ్‌కు కితాబు

కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ మోదీ మంత్రివర్గంలో తన ప్రత్యేకతను చాటుకున్నారు. అత్యుత్తమ పనితీరుతో నంబర్‌ వన్‌ స్థానంలో నిలిచారు. ఇటీవల ఇండియా టుడే-కార్వీ నిర్వహించిన సర్వేలో పాల్గొన్న 13 వేల మందిలో ఎక్కువమంది రాజ్‌నాథ్‌కు జైకొట్టారు.

విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌లు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. మంత్రి సుష్మా స్వరాజ్‌ మరో ప్రత్యేకతను చాటుకున్నారు. ఆమె ట్విటర్‌లో చురుగ్గా వ్యవహరిస్తారని, విదేశాల్లో భారతీయులు ఆపదలో చిక్కుకున్నప్పుడు ఆమె వేగంగా స్పందిస్తారని సర్వేలో అత్యధిక మంది తెలిపారు.

Narendra Modi
india today karve
rajanadh sing
  • Loading...

More Telugu News