Sujana Chowdary: బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా 10 సభలు: సుజనా చౌదరి

  • ఓట్ల కోసమే కేంద్రం ట్రిపుల్ తలాక్
  • నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోంది
  • ఈవీఎంలపైనా పార్లమెంటులో నిరసన

ఓట్ల కోసమే కేంద్రం ట్రిపుల్ తలాక్ తెచ్చిందని ఎంపీ సుజనా చౌదరి పేర్కొన్నారు. నేడు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా 10 సభలు పెట్టాలని బీజేపీయేతర పార్టీలు నిర్ణయం తీసుకున్నాయని.. అయితే అమరావతిలో సభకు తేదీ ఖరారు కావాల్సి ఉందని అన్నారు. కేంద్రం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని... దుష్టపాలన చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈవీఎంలపైనా పార్లమెంటులో నిరసన తెలియజేస్తామని సుజనా చౌదరి తెలిపారు. పూర్తి బడ్జెట్ ప్రవేశ పెట్టే హక్కు కేంద్రానికి లేదన్నారు.

Sujana Chowdary
BJP
Delhi
Amaravathi
Triple Talaq
Budget
  • Loading...

More Telugu News