India: గణతంత్ర దినోత్సవ ప్రసంగాన్ని చదవలేకపోయిన మంత్రి.. మండిపడుతున్న నెటిజన్లు!

  • మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఘటన
  • స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఇమార్తీ దేవి తడబాటు
  • ప్రసంగాన్ని పూర్తిచేసిన కలెక్టర్

మధ్యప్రదేశ్ రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి, కాంగ్రెస్ నేత ఇమార్తీ దేవికి ఈరోజు ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురయింది. ఇండోర్ లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గణతంత్ర దినోత్సవ ప్రసంగాన్ని చదవడానికి ఆమె తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. మొత్తం నాలుగు లైన్లలో 8 తప్పులను చదివారు. చివరికి జిల్లా కలెక్టర్ కు కాపీ ఇచ్చేసి తప్పుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో పలువురు నెటిజన్లు మంత్రిని తప్పుపడుతూ కామెంట్లు చేశారు.

ఈ నేపథ్యంలో వీడియోపై ఇమార్తీ దేవి వివరణ ఇచ్చారు. తాను గత రెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నానని తెలిపారు. అందువల్లే ప్రసంగాన్ని చదవలేకపోయానని వ్యాఖ్యానించారు.  ప్రస్తుతం తన ఆరోగ్యం మెరుగయిందన్నారు. అయినా కలెక్టర్ ప్రసంగాన్ని చదివేశాక ఇంకా వివాదం ఏముందని ప్రశ్నించారు. 2008లో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయిన ఇమార్తీ దేవి.. 2008-11 మధ్యకాలంలో లైబ్రరీ కమిటీ సభ్యురాలిగా పనిచేశారు. 2011-2014 సమయంలో స్త్రీ, శిశు సంక్షేమ కమిటీ సభ్యురాలిగా సేవలు అందించారు.

  • Loading...

More Telugu News