kumaraswamy: మా ఎమ్మెల్యేకు బీజేపీ ఎంత ఆఫర్ చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!: కర్ణాటక సీఎం కుమారస్వామి

  • కర్ణాటకలో ఆపరేషన్ లోటస్ కొనసాగుతూనే ఉంది
  • నిన్న రాత్రి కూడా మా ఎమ్మెల్యేను బీజేపీ నేతలు ప్రలోభపెట్టారు
  • డబ్బు ఎరచూపి మా ఎమ్మెల్యేలను లొంగదీసుకోలేరు

బీజేపీపై కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి నిప్పులు చెరిగారు. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ చేయని ప్రయత్నం అంటూ లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ఆపరేషన్ లోటస్ ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పారు. నిన్న రాత్రి కూడా తమ ఎమ్మెల్యే ఒకరిని బీజేపీ నేతలు కలిసి ప్రలోభాలకు గురిచేశారని తెలిపారు. ఎంత డబ్బు ఇస్తామన్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారని చెప్పారు. అయితే, ఇలాంటి గిమ్మిక్కులు తనపై ప్రయోగించవద్దని తమ ఎమ్మెల్యే బీజేపీ నేతలకు స్పష్టంగా చెప్పారని తెలిపారు. డబ్బు ఎరచూపి తమ ఎమ్మెల్యేలను లొంగదీసుకోలేరని చెప్పారు. 

kumaraswamy
bjp
congress
jds
karnataka
operation lotus
  • Loading...

More Telugu News