Andhra Pradesh: బసవతారకం ఆసుపత్రిలో జాతీయ జెండాను ఆవిష్కరించిన బాలకృష్ణ!

  • సంపూర్ణ స్వరాజ్యానికి ఇది ప్రతీక
  • ఆగస్టు 15, జనవరి 26 మిఠాయిలు పంచుకోవడమే కాదు
  • మహానుభావుల త్యాగఫలాన్ని భవిష్యత్ తరాలకు అందించాలి

గణతంత్ర దినోత్సవం అంటే సంపూర్ణ స్వరాజ్యానికి ప్రతీకని హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ తెలిపారు. డా.బీఆర్ అంబేద్కర్ నాయకత్వంలో 389 మంది సభ్యులు రెండేళ్ల పాటు శ్రమించి రాజ్యాంగానికి రూపకల్పన చేశారని గుర్తుచేశారు. ఆ రాజ్యాంగ పత్రం అమల్లోకి వచ్చిన జనవరి 26న రిపబ్లిక్ డేగా జరుపుకుంటున్నామని అన్నారు. ఆగస్టు 15, జనవరి 26 అంటే సంతోషంతో మిఠాయిలు పంచుకోవడమే కాదనీ, అంతకు మించిన స్ఫూర్తి ఈ వేడుకల్లో ఉండాలన్నారు.

హైదరాబాద్ లోని బసవతారకం ఆసుపత్రిలో ఈరోజు జాతీయ పతాకాన్ని బాలయ్య ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. బసవతారకం ఆసుపత్రిలో భాగమైన కుటుంబ సభ్యులందరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహానుభావుల త్యాగఫలాన్ని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.

Andhra Pradesh
Telangana
Balakrishna
Telugudesam
Hyderabad
basavatarakam
hospital
republic day
  • Loading...

More Telugu News