: చెన్నైలో ఐపిఎల్ మ్యాచుకు తొలగిన అడ్డంకి


చెన్నైలోని ఎంఎ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్ల మధ్య నేడు మ్యాచ్ కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ స్టేడియంలో మూడు స్టాండుల వినియోగంపై తమిళనాడు మునిసిపల్ కార్పొరేషన్ నిషేధం విధించగా దానిపై తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టు దానిని తొలగించింది. ఆ మూడు స్టాండులలో నిర్మాణ పనులు జరుగుతున్నందున ప్రేక్షకులను అనుమతించడానికి వీలు పడదని మునిసిపల్ కార్పొరేషన్ వాదించగా.. టికెట్లను విక్రయించినందున అనుమతించాలని తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ కోరింది.

  • Loading...

More Telugu News