India: పాసు పుస్తకాల కోసం లంచం కోరిన ఎమ్మార్వో.. భిక్షాటన చేసి తిక్కకుదిర్చిన వృద్ధ జంట!

  • తెలంగాణలోని భూపాలపల్లిలో ఘటన
  • లంచం ఇవ్వాలంటూ భిక్షాటన చేసిన దంపతులు
  • పాస్ పుస్తకాలు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశం

లంచం ఇస్తేనే పాస్ పుస్తకాలు ఇస్తానని ఓ అధికారి మెలిక పెట్టాడు. దీంతో ఏం చేయాలో తెలియని వృద్ధ దంపతులు వినూత్నంగా నిరసనకు దిగారు. ఓ అవినీతిపరుడికి లంచం ఇవ్వాలనీ, దయచేసి సాయం చేయాలని బిక్షాటన మొదలుపెట్టారు. ఈ విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో వెంటనే పాస్ పుస్తకాలను అధికారులు మంజూరు చేశారు. ఈ ఘటన తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని భూపాలపల్లి మండలం ఆజంనగర్ కు చెందిన మంతు లక్ష్మి, బసువయ్య దంపతులు. వీరికి సర్వేనెంబర్‌ 622/52లో 2.37 ఎకరాల భూమి ఉంది. ఇందులో 1.37 ఎకరాల భూమిని అదే గ్రామానికి చెందిన కానుగంటి కొంరయ్యకు ఫోర్జరీ పత్రాల ద్వారా అప్పగించేందుకు అధికారులు యత్నించినట్లు బసువయ్య దంపతులు ఆరోపించారు. ఈ విషయమై పలుమార్లు ఎమ్మార్వో కార్యాలయానికి వచ్చినప్పటికీ న్యాయం జరగకపోవడంతో వీరిద్దరూ గతేడాది నవంబర్ 19న పురుగుల మందు డబ్బాతో ఆందోళనకు దిగారు. న్యాయం చేయకుంటే ఆత్మహత్యే తమకు శరణ్యమని వాపోయారు.

ఈ విషయంలో లంచం ఇస్తేనే తాను భూమి పట్టాలు ఇస్తానని ఎమ్మార్వో చెప్పినట్లు లక్ష్మీ-బసువయ్య దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. చేతిలోని నగలు, నగదు ఖర్చయిపోవడంతో వినూత్నంగా నిరసనకు దిగారు. తమకు జరిగిన అన్యాయాన్ని ప్లెక్సీలపై రాయించి భిక్షాటన చేయడం మొదలుపెట్టారు. తమ భూమిని కాపాడుకోవడానికి సాయం చేయాలని కోరారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో కలెక్టర్ దృష్టికి వెళ్లింది.

దీంతో బాధిత కుటుంబానికి వెంటనే పట్టా పాసు పుస్తకాలు జారీచేయాలని కలెక్టర్ ఆర్డీవోను ఆదేశించారు. స్పందించిన ఆర్డీవో ఇ.వెంకటాచారి వీరిని ఆఫీసుకు పిలిపించి పట్టా పాసుపుస్తకాలను అందజేశారు. కాగా పాస్ పుస్తకాలకు సంబంధించిన కొన్ని సమస్యల కారణంగానే ఇలాంటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని ఆర్డీవో వెంకటాచారి తెలిపారు. ఎమ్మార్వో లంచం డిమాండ్ చేశారనడంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు.

India
Telangana
farmars
old couple
bribe
corruption
Jayashankar Bhupalpally District
pass book
MRO
District Collector
  • Loading...

More Telugu News