osmania university: ఉస్మానియా యూనివర్శిటీలో జాతీయ జెండాకు అవమానం

  • చిరిగిపోయిన జెండాను ఎగురవేసిన అధికారులు
  • ఆందోళనకు దిగిన ఉస్మానియా విద్యార్థులు
  • జెండాను నిర్లక్ష్యంగా ఎగురవేయడంపై ఆగ్రహం

వందేళ్లకు పైగా చరిత్ర కలిగి, ఎంతో ఘనత వహించిన ఉస్మానియా యూనివర్శిటీలో... గణతంత్ర దినోత్సవం రోజున జాతీయ జెండాకు తీరని అవమానం జరిగింది. రిపబ్లిక్ డే సందర్భంగా ఆర్ట్స్ కాలేజీ బిల్డింగ్ పై యూనివర్శిటీ అధికారులు జాతీయ జెండాను ఎగురవేశారు. అయితే, ఆ జాతీయ జెండా చిరిగిపోయి ఉండటం కలకలం రేపింది. చిరిగిపోయిన జెండాను గుర్తించిన విద్యార్థులు ఆందోళనకు దిగారు. జెండా ఎలా ఉందో కూడా చూసుకోకుండా, నిర్లక్ష్యంగా ఎగురవేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, అధికారులు వెంటనే దిద్దుబాటు చర్యలను చేపట్టారు. మరో జెండాను తెప్పించి, ఎగురవేశారు. మరోవైపు, రిపబ్లిక్ డే వేడుకల ఏర్పాట్లు కూడా సరిగా లేవంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

osmania university
Hyderabad
flag
hoisting
Republic Day
  • Loading...

More Telugu News