arjun reddy: హిందీ 'అర్జున్ రెడ్డి' సెట్ లో ప్రమాదం.. ఒకరి మృతి

  • 'కబీర్ సింగ్' పేరుతో హిందీలో తెరకెక్కుతున్న 'అర్జున్ రెడ్డి'
  • ముస్సోరిలో గత కొంత కాలంగా షూటింగ్
  • జనరేటర్ రిపేర్ చేస్తూ ప్రమాదానికి గురైన వ్యక్తి

తెలుగులో సంచలన విజయం సాధించిన 'అర్జున్ రెడ్డి' చిత్రం బాలీవుడ్ లో 'కబీర్ సింగ్' పేరుతో తెరకెక్కుతోంది. షాహిద్ కపూర్, కియారా అద్వానీలు ఈ చిత్రంలో లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ఉత్తరాఖండ్ లోని ముస్సోరిలో గత కొంత కాలంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.

షూటింగ్ సందర్భంగా జనరేటర్ పనిచేయకపోవడంతో... దానికి మరమ్మతు చేసేందుకు రాము అనే వ్యక్తి అక్కడకు వచ్చాడు. జనరేటర్ కు రిపేర్ చేస్తుండగా దాని రెక్కలలో అతను చిక్కుకుపోయాడు. దీంతో, అతని తలకు తీవ్ర గాయమైంది. అతడిని చిత్రయూనిట్ హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు.

arjun reddy
kabir singh
bollywood
accident
  • Loading...

More Telugu News