Republic Day: బాబాయిపై పాటను విడుదల చేసిన రామ్ చరణ్!

  • పాటను రూపొందించిన జనసేన
  • జనసేన కార్యక్రమాలతో సాగే పాట
  • దేశం కోసం పోరాడిన హీరోలకు అంకితం

రేపు మన గణతంత్ర దినోత్సవాన్ని జనసేన పార్టీ ఓ పాటను రూపొందించింది. ‘ఒకడొచ్చాడు.. వచ్చాడు.. జాతిని జాగృతి గొలుప..’ అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన కార్యక్రమాలతో సాగే ఈ పాటను నేడు రామ్ చరణ్ విడుదల చేశాడు. తన దృష్టిలో, లక్షలాది అభిమానుల దృష్టిలో బాబాయి ఎలా ఉంటాడో చెప్పే పాట ఇది అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టాడు.

‘69వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ పాటను దేశం కోసం పోరాడిన హీరోలకు అంకితం చేస్తున్నా. నా దృష్టిలో, లక్షలాది అభిమానుల దృష్టిలో, అంతకన్నా ఎక్కువ ఉండే జన సైనికుల దృష్టిలో బాబాయి ఎలా ఉంటాడో చెప్పే ఓ పాట ఇది.. దీన్ని విని స్ఫూర్తి పొందండి. జై హింద్‌’ అని చరణ్‌ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. ఈ పాటకు అటు పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తల నుంచి మంచి స్పందన వస్తోంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News