Palani Swamy: జయలలిత ఎస్టేట్ గార్డ్ హత్యకేసులో.. పళనిస్వామిపై దాఖలైన పిటిషన్ కొట్టివేత

  • అనుమానాస్పద స్థితిలో గార్డ్ హత్య
  • వీడియో క్లిప్ ఆధారంగా పళనిపై పిటిషన్ 
  • నేడు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు

ఓ హత్య కేసులో తమిళనాడు సీఎం పళనిస్వామికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 2017లో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడ్ ఎస్టేట్‌లోఅక్కడి గార్డ్ ఓమ్‌ బహదూర్‌(40) అనుమానాస్పద స్థితిలో హత్యకు గురయ్యాడు.

ఈ హత్యతో పళనిస్వామికి సంబంధం ఉందంటూ ఇటీవల ఓ మ్యాగజైన్ విడుదల చేసిన వీడియో క్లిప్ ఆధారంగా సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎస్టేట్ హత్య కేసులో సీబీఐ దర్యాప్తు చేపట్టాలని ఆయన పిటిషన్‌‌లో కోరారు. ఈ కేసు విషయమై నేడు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు... రామస్వామి వేసిన పిటీషన్‌ను తోసిపుచ్చింది. కొందరు దుండగులు గార్డ్‌ను హత్య చేసి విలువైన పత్రాలు, వస్తువులను దోచుకెళ్లినట్టు అప్పట్లో పోలీసులు పేర్కొన్నారు.  

  • Loading...

More Telugu News