kct: ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం.. కేసీఆర్ పై హైకోర్టులో పిటిషన్
- కేసీఆర్ పై పిటిషన్ దాఖలు చేసిన గజ్వేల్ ఓటరు
- 64 క్రిమినల్ కేసులు ఉంటే.. 2 కేసులు మాత్రమే ఉన్నట్టు చూపారంటూ ఆరోపణ
- ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని విన్నపం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆయన సొంత నియోజకవర్గానికి చెందిన ఒక ఓటరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్ లో కేసీఆర్ తప్పుడు సమాచారం ఇచ్చారని శ్రీనివాస్ అనే వ్యక్తి తన పిటిషన్ లో పేర్కొన్నారు. కేసీఆర్ పై మొత్తం 64 క్రిమినల్ కేసులు ఉన్నాయని... అయితే మొదటి అఫిడవిట్ లో 2 కేసులు మాత్రమే ఉన్నట్టు చూపారని తెలిపారు. అఫిడవిట్ లో తప్పుడు సమాచారాన్ని ఇచ్చిన కేసీఆర్ ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని కోర్టును కోరారు. వచ్చే సోమవారం ఈ పిటిషన్ విచారణకు రానుంది.