Telangana: చిన్నారి గుండెలో మూడు రంధ్రాలు.. ట్విట్టర్ లో స్పందించిన కల్వకుంట్ల కవిత!

  • టీఆర్ఎస్ నేత దృష్టికి తెచ్చిన నెటిజన్
  • బాధిత కుటుంబం నిస్సహాయస్థితిలో ఉందని వ్యాఖ్య
  • వివరాలు పంపాలని కోరిన కవిత

తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆయన సోదరి కవిత సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. ప్రజలు ఏదైనా సమస్యలను ప్రస్తావిస్తే వెంటనే చర్యలు తీసుకుంటారు. తాజాగా భద్ర నాని అనే ఓ యువకుడు ట్విట్టర్ లో స్పందిస్తూ..‘మేడం, మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా.. నా సోదరుడి కుమారుడి గుండెలో మూడు రంధ్రాలు ఉన్నాయి. చిన్నారికి వీలయినంత త్వరగా ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెబుతున్నారు. కానీ నా సోదరుడి దగ్గర డబ్బులన్నీ అయిపోయాయి. మేం ఆశలన్నీ వదిలేసుకున్నాం. దయచేసి సాయం చేయండి’ అని విజ్ఞప్తి చేశారు.

45 రోజుల క్రితం పుట్టిన ఈ చిన్నారి న్యూమోనియాతో బాధపడుతోందని తెలిపారు. ఈ ట్వీట్ కు కేటీఆర్, కొణిదెల ఉపాసన, హీరోయిన్ అక్కినేని సమంతను ట్యాగ్ చేశారు. దీంతో కల్వకుంట్ల కవిత వెంటనే స్పందించారు. చిన్నారికి సంబంధించిన వివరాలను తనకు పంపాలని కోరారు. తన కార్యాలయం తగిన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.

Telangana
Hyderabad
infant
3 heart holes
TRS
K Kavitha
KTR
upasana
samantha
Twitter
  • Loading...

More Telugu News