KTR: కృతజ్ఞతలు ఉపాసన: కేటీఆర్ ట్వీట్

  • దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సు
  • ఇన్వెస్ట్ తెలంగాణ డెస్క్ సమన్వయకర్తగా ఉపాసన
  • కాసేపు రిసెప్షన్ లో కూర్చున్న ఫోటో వైరల్

ప్రస్తుతం దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 'ఇన్వెస్ట్ తెలంగాణ' డెస్క్ కు సమన్వయకర్తగా ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసనకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. నిన్న దావోస్ లో తెలంగాణ స్టాల్ రిసెప్షన్ లో కూర్చుని తాను దిగిన ఫొటోను ట్వీట్ చేస్తూ, "కేటీఆర్ సర్... నేను కొత్త ఉద్యోగంలో చేరారు. నా జాబ్ ఎలా ఉంది" అని ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై కేటీఆర్ స్పందించారు. "మా బృందం స్థ్యైర్యాన్ని పెంచినందుకు కృతజ్ఞతలు" అంటూ రిప్లయ్ ఇచ్చారు. ఇప్పుడు ఈ ట్వీట్ కూడా వైరల్ అవుతోంది.



KTR
Upasana
WEF
Dawos
Telangana
  • Loading...

More Telugu News