Andhra Pradesh: ఏపీకి గవర్నర్ గా వెళ్లనున్నారన్న వార్తలపై స్పందించిన కిరణ్ బేడీ!

  • కిరణ్ బేడీని ఏపీకి పంపుతున్నారని వార్తలు
  • ఆ వార్తలన్నీ వదంతులేనన్న కిరణ్ బేడీ
  • ఎన్నికల్లో పోటీ చేయబోనని వెల్లడి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి గవర్నర్‌ గా ఉన్న ఈఎస్ఎల్ నరసింహన్ ను తెలంగాణకు మాత్రమే పరిమితం చేసి, అక్కడ తనను నియమిస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడీ స్పందించారు. పుదుచ్చేరి, తట్టాంచావడిలోని ఆది ద్రావిడర్‌ సంక్షేమశాఖ కార్యాలయాన్ని తనిఖీ చేసేందుకు వచ్చిన ఆమె, ఆపై మీడియాతో మాట్లాడారు.

 తాను ఏపీకి వెళ్లనున్నట్టు వచ్చిన వార్తలు వదంతులేనని స్పష్టం చేశారు. ఇదే సమయంలో తాను రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఎంపీగా బరిలోకి దిగుతానన్నది కూడా అవాస్తవమేనని చెప్పారు. ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయాలని తాను భావించడం లేదని, పరిపాలనా వ్యవహారాల్లో కొనసాగాలనే కోరుకుంటున్నానని కిరణ్ బేడీ తెలిపారు.

Andhra Pradesh
Tamilnadu
Kiran Bedi
Governer
  • Loading...

More Telugu News