Sunny Leone: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • సన్నీ లియోన్ నాయికగా 'రంగీలా'
  • మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి మెగా ఫ్యామిలీ 
  • టీవీలో 'అరవింద'కు తగ్గిన ఆదరణ!  

*  బాలీవుడ్ శృంగారతార సన్నీ లియోన్ తాజాగా ఓ మలయాళ చిత్రంలో నటించడానికి అంగీకరించింది. సంతోష్ నాయర్ దర్శకత్వంలో రూపొందే 'రంగీలా' మలయాళ చిత్రంలో తాను నటిస్తున్నట్టు, ఈ నెలాఖరు నుంచి షూటింగ్ జరగనున్నట్టు సన్నీ తెలిపింది.
*  ఇటీవల మహేశ్ బాబు మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి దిగి, హైదరాబాదు గచ్చిబౌలిలో 'ఏఎంబీ సినిమాస్' పేరిట థియేటర్లను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇదే కోవలో చిరంజీవి కుటుంబం కూడా మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి దిగుతోందట. రామ్ చరణ్, ఉపాసన దంపతులు ప్రస్తుతం అందుకు సంబంధించిన ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
*  ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన 'అరవింద సమేత' చిత్రం బాక్సాఫీసు వద్ద బాగానే వసూలు చేసినప్పటికీ, టీవీలో మాత్రం అంతగా రాణించలేకపోయింది. ఈ సంక్రాంతి సీజన్ కి టీవీలో ప్రసారమైన ఈ చిత్రానికి 13.7 టీఆర్పీ మాత్రమే వచ్చింది. గతంలో 'రంగస్థలం' 19.51, 'భరత్ అనే నేను' 17 టీఆర్పీ పొందాయి. 

Sunny Leone
Chiranjivi
Charan
Upasana
Mahesh Babu
NTR
  • Loading...

More Telugu News