Purushotham Rupala: త్వరలోనే రైతులు శుభవార్త వింటారు: కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి

  • రైతులకు కేంద్రం ప్యాకేజీ ప్రకటించనుంది
  • బడ్జెట్ లేదంటే ముందే ప్రకటించే అవకాశం
  • రైతుల ఆలోచనలను పరిగణనలోకి తీసుకోనుంది

త్వరలోనే దేశంలోని రైతులు శుభవార్త వింటారని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పరుషోత్తమ్ రూపాలా వెల్లడించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతుల ఆదాయాన్ని పెంచే క్రమంలో భాగంగా కేంద్రం త్వరలో ప్యాకేజీ ప్రకటించనుందని స్పష్టం చేశారు. అయితే ఈ ప్యాకేజీని రాబోయే బడ్జెట్‌లో ప్రకటిస్తారా? లేదంటే ముందే వెల్లడిస్తారా? అనే దానిపై మాత్రం స్పష్టత రాలేదన్నారు. ఈ విషయంలో రైతుల ఆలోచనలను కూడా కేంద్రం పరిగణనలోకి తీసుకోనుందని పురుషోత్తమ్ చెప్పారు. 

Purushotham Rupala
Formers
Central Government
Package
Budget
  • Loading...

More Telugu News