Pawan Kalyan: సభలు పెట్టి గిరిజనులను రెచ్చగొట్టవద్దు: పవన్ కు మంత్రి కిడారి శ్రవణ్ సూచన

  • కిడారి, సోమల హత్యలకు చంద్రబాబే కారణమన్న పవన్
  • గిరిజనుల కోసం ప్రభుత్వం ఎంతో చేస్తోందన్న శ్రవణ్
  • గిరిజనులను రెచ్చగొట్టడం సరికాదంటూ సూచన

ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్యలకు ముఖ్యమంత్రి చంద్రబాబే కారణమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పాడేరులో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ ఈ మేరకు ఆరోపించారు.

పవన్ వ్యాఖ్యలను కిడారి సర్వేశ్వరరావు కుమారుడు, మంత్రి కిడారి శ్రవణ్ ఖండించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సభలు పెట్టి గిరిజనులను రెచ్చగొట్టడం పవన్ కు తగదని అన్నారు. గిరిజనుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎంతో చేస్తోందని చెప్పారు. ఏజెన్సీ ప్రాంతంలోని అధికారులు బాగా పని చేయాలని, అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. 

Pawan Kalyan
janasena
kidari sravan
kidari sarveswara rao
siveri soma
  • Loading...

More Telugu News