Andhra Pradesh: వంగవీటి రాధాకృష్ణకు అధిక ప్రాధాన్యం ఇచ్చాం.. రంగా విగ్రహావిష్కరణలపై ఆంక్షలు పెట్టలేదు!: వైసీపీ నేత సామినేని

  • రాధా పనితీరును చూపించలేకపోయారు
  • జగన్ ఆయనకు 3 పదవులు ఇచ్చారు
  • సెంట్రల్ సీటు ఇవ్వలేదనే రాధా విమర్శలు

వంగవీటి రాధాకృష్ణపై జగన్ ఎలాంటి ఆంక్షలు విధించలేదని వైసీపీ నేత సామినేని ఉదయభాను తెలిపారు. జగన్ ఆయనకు మూడు కీలకమైన పదవులు ఇచ్చారని గుర్తుచేశారు. అయితే రాధా తన స్థాయికి తగ్గ పనితీరును కనబర్చలేకపోయారని వ్యాఖ్యానించారు. విజయవాడలో పార్టీ తరఫున పనిచేసేందుకు అవకాశం ఉందని రాధాకృష్ణకు జగన్ చాలాసార్లు చెప్పారని, అయినా ఆయన చేయలేదని అన్నారు.

రంగా కుమారుడిగా రాధాకు జగన్ చాలా ప్రాధాన్యం ఇచ్చారని ఉదయభాను తెలిపారు. విజయవాడ సెంట్రల్ సీటులో పార్టీ పటిష్టతకు రాధాకృష్ణ కృషి చేయలేదని విమర్శించారు. విజయవాడ సెంట్రల్ సీటు ఇవ్వలేదనే జగన్ పై రాధ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. వంగవీటి రంగా విగ్రహాల ఆవిష్కరణ విషయంలో పార్టీ ఎక్కడా ఆంక్షలు విధించలేదని స్పష్టం చేశారు.

Andhra Pradesh
vangaveeti
radhakrishna
ranga
YSRCP
Jagan
statue
samineni
udaybhanu
  • Loading...

More Telugu News