air tel: మరో రెండు బంపర్ ఆఫర్ లని ప్రకటించిన ఎయిర్ టెల్

  • రూ.998, రూ.597 రీఛార్జ్ ప్లాన్ల ప్రకటన 
  • రూ.998 ప్లాన్ వ్యాలిడిటీ 336 రోజులు 
  • రూ.597 ప్లాన్ వ్యాలిడిటీ 168 రోజులు

టెలికాం రంగ సంస్థ భారతి ఎయిర్ టెల్ ఇటీవలే సంవత్సరం వ్యాలిడిటీతో రూ.1699 ప్రీ పెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తన వినియోగదారుల కోసం రూ.998, రూ.597 విలువ గల మరో రెండు ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను ప్రకటించింది. 336 రోజుల వ్యాలిడిటీ గల రూ.998 రీఛార్జ్ ప్లాన్ లో భాగంగా అన్ లిమిటెడ్ కాల్స్, ప్రతినెలకి 300 ఎస్ఎంఎస్ లతో పాటు పూర్తి వ్యాలిడిటీ కాలానికి 12 జీబీ డేటా లభించనుంది. అలాగే, 168 రోజుల వ్యాలిడిటీ గల రూ.597 రీఛార్జ్ ప్లాన్ లో భాగంగా అన్ లిమిటెడ్ కాల్స్, ప్రతినెలకి 300 ఎస్ఎంఎస్ లతో పాటు పూర్తి వ్యాలిడిటీ కాలానికి 6 జీబీ డేటాని పొందనున్నారు.

air tel
Rs 998
Rs 597
Bharti Airtel
Tech-News
technology
  • Loading...

More Telugu News