Sofia Hayat: టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మపై నటి సోఫియా హయత్ సంచలన వ్యాఖ్యలు

  • రోహిత్ నేను ఓ క్లబ్‌లో ఏకాంతంగా కలిశాం
  • అప్పుడు నన్ను ముద్దుపెట్టుకున్నాడు
  • మీడియా కంటబడడంతో రోహిత్ తప్పించుకున్నాడు

టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మతో ఒకప్పుడు ప్రేమలో ఉన్నమాట నిజమేనని వివాదాస్పద నటి, మోడల్ సోఫియా హయత్ సంచలన వ్యాఖ్యలు చేసింది. 2012లో రోహిత్‌తో డేటింగ్ చేసినట్టు చెప్పిన హయత్.. లండన్‌లోని ఓ క్లబ్‌లో ఇద్దరం ఏకాంతంగా కలిశామని, అప్పుడు రోహిత్ తనను ముద్దుపెట్టుకున్నట్టు చెప్పింది.

తాను క్రికెట్‌ను ఎక్కువగా చూడనని, కాబట్టి రోహిత్ క్రికెటర్ అన్న విషయం అప్పటి వరకు తనకు తెలియదని పేర్కొంది. తన స్నేహితురాలి ద్వారా రోహిత్‌ను కలిసినట్టు తెలిపింది. దీంతో ఇద్దరికీ పరిచయం ఏర్పడిందని, ఆ తర్వాత అది ప్రేమగా మారిందని సోఫియా చెప్పుకొచ్చింది.

త్వరలోనే తన జీవితంపై ఓ పుస్తకం రాయాలనుకుంటున్నట్టు చెప్పిన సోఫియా.. రోహిత్‌తో తనకున్న అఫైర్ గురించి కూడా అందులో వివరిస్తానని పేర్కొంది. మీడియాకు తెలియనంత వరకు తమ ప్రేమ వ్యవహారం బాగానే సాగిందని, ఆ తర్వాత మీడియా ప్రశ్నించడంతో రోహిత్ తప్పించుకున్నాడని పేర్కొంది. ఇక ఆ తర్వాత అతడితో విడిపోయినట్టు బ్రిటిష్ ముద్దుగుమ్మ సోఫియా వివరించింది.

Sofia Hayat
Rohit Sharma
Team India
Bollywood
London
  • Loading...

More Telugu News