Nawaj Sharief: నవాజ్ షరీఫ్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరం!

  • పలు అవినీతి కేసుల్లో జైలు శిక్ష
  • గుండెల్లో నొప్పిగా ఉందని చెప్పడంతో ఆసుపత్రికి
  • పరీక్షల అనంతరం తిరిగి జైలుకు

 అవినీతి కేసుల్లో జైలుశిక్ష అనుభవిస్తున్న పాక్ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ ఆరోగ్య పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందని ఆయన వ్యక్తిగత వైద్యుడు వెల్లడించారు. గుండె సంబంధిత సమస్యలతో ఆయన బాధపడుతున్నారని, తక్షణమే ఆయన్ను ఆసుపత్రికి తరలించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రస్తుతం లాహోర్‌ పరిధిలోని కోట్‌ లఖ్‌ పత్‌ జైల్లో నవాజ్ తన శిక్షను అనుభవిస్తున్న సంగతి తెలిపిందే.

 మంగళవారం రాత్రి ఆయన తన ఛాతీలో అసౌకర్యంగా ఉందని చెప్పడంతో, ఆ వెంటనే పంజాబ్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ కార్డియాలజీకి తరలించి పరీక్షలు నిర్వహించారు. ఆపై ఆరోగ్యం బాగానే ఉందంటూ తిరిగి జైలుకు తీసుకెళ్లారు. మందులు వాడుతూ, క్రమానుసారం పరీక్షలు చేయించుకుంటే సరిపోతుందని వైద్యులు వెల్లడించారు.

అయితే, ఆయన్ను జైల్లో ఉంచితే, చికిత్స సాధ్యం కాదని, ఆసుపత్రిలోనే వుంచి చికిత్స చేయించాల్సివుందని నవాజ్ వ్యక్తిగత వైద్యుడు, హృద్రోగ నిపుణుడు అద్నాన్‌ ఖాన్‌ వ్యాఖ్యానించారు. నవాజ్ ఆరోగ్యాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. కాగా, తన తండ్రి గురించిన వార్తలు తమకు మీడియా ద్వారా మాత్రమే తెలుస్తున్నాయని, ఆయన ఆరోగ్యంపై ఆందోళనగా ఉందని నవాజ్ కుమార్తె మరియం వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News