Chandrababu: జగన్‌పై దాడి కేసులో చంద్రబాబుపై బొత్స సంచలన వ్యాఖ్యలు

  • చంద్రబాబు, లోకేశ్, ఉన్నతాధికారుల కుట్ర
  • ఎన్ఐఏకి ఎందుకు సహకరించట్లేదు?
  • కేసును నీరుగార్చేందుకు చూస్తున్నారు

ఏపీ సీఎం చంద్రబాబు, లోకేశ్‌లపై వైసీపీ నేత బొత్స సత్యనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌పై దాడి వెనుక  చంద్రబాబు, లోకేశ్, పోలీస్ ఉన్నతాధికారుల కుట్ర ఉందని ఆరోపించారు. కుట్ర కోణం లేకపోతే ఎన్‌ఐఏకి ప్రభుత్వం ఎందుకు సహకరించట్లేదని ప్రశ్నించారు. కేసును నీరుగార్చేందుకు ప్రభుత్వం చూస్తోందని బొత్స విమర్శించారు. జగన్‌పై దాడి కేసులో కుట్ర కోణంపై విచారణ జరపాలని ఎన్ఐఏ కోర్టుకి స్పష్టంగా చెప్పిందని ఆయన తెలిపారు.  

Chandrababu
Jagan
Botsa Satyanarayana Satyanarayana
Police Officers
NIA
  • Loading...

More Telugu News