KTR: కేసీఆర్ ఏం చేస్తే.. చంద్రబాబు అదే చేయాలనుకుంటున్నారు: కేటీఆర్ ఎద్దేవా

  • సమస్యల పరిష్కారం నా బాధ్యత
  • పథకాలను కాపీ కొడుతున్నారు
  • చంద్రబాబువి ఆపద మొక్కులు

తెలంగాణ సీఎం కేసీఆర్ ఏం చేస్తే.. తాను కూడా అదే చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు భావిస్తున్నారని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. నేడు నాంపల్లిలోని ప్రియదర్శిని ఆడిటోరియంలో జరిగిన ఆందోల్‌ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ ఆత్మీయ సన్మానానికి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పాత్రికేయుల సమస్యలను పరిష్కరించడం తన బాధ్యతగా పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను చంద్రబాబు కాపీ కొడుతున్నారని విమర్శించారు. చంద్రబాబువి ఆపద మొక్కులని.. చిత్తశుద్ధి లేని శివపూజలు చేస్తే ఒరిగేదేం లేదంటూ విమర్శించారు.

KTR
Chandrababu
KCR
Kranthi Kiran
Nampally
Priyadarsini Auditorium
  • Loading...

More Telugu News