Veteran actor: ప్యాంట్ ధరించిన యాంకర్‌కు షాకిచ్చిన వెటరన్ నటి, బీజేపీ నేత.. చీర కట్టుకోవాలని హితవు

  • ఈ నెల 2న బీజేపీలో చేరిన నటి
  • సూరత్‌లో మీడియా సమావేశం
  • ప్యాంటు ధరించి వచ్చిన యాంకర్‌

ఇటీవలే బీజేపీలో చేరిన సీనియర్ నటి మౌసమి చటర్జీ ఓ మహిళా యాంకర్‌కు షాకిచ్చారు. సూరత్‌లోని ఓ హోటల్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ఓ మహిళా యాంకర్ ప్యాంటు ధరించి వచ్చింది. మీడియా సమావేశం ప్రారంభం కాబోతోందంటూ చటర్జీని అందరికీ పరిచయం చేశారు. ఆమె ఇచ్చిన మైక్‌ను తీసుకున్న చటర్జీ ఒకసారి యాంకర్‌ను ఎగాదిగా చూసి, ఆమె ఆహార్యం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.

‘‘చూడమ్మాయి.. నువ్వు ధరించిన దుస్తులు ఏమంత బాగోలేవు. వీటి కంటే నువ్వు చీరనో, కుర్తా-చుడీదారో ధరించడం మంచిది’’ అని చెప్పడంతో యాంకర్ బిత్తరపోయింది. ఆ తర్వాత మళ్లీ చటర్జీ మాట్లాడుతూ.. ఇంకోలా అనుకోవద్దని, ఓ తల్లిలా చెప్పానని పేర్కొన్నారు. చటర్జీ మాటలతో కొంత అసహానికి గురైన యాంకర్ ఆ తర్వాత కార్యక్రమాన్ని నిర్వహించేందుకు నిరాకరించింది. 

Veteran actor
Moushumi Chatterjee
anchor
pants
  • Loading...

More Telugu News