Manikyala Rao: బీరు తాగి.. దానిని మజ్జిగనో, కూల్‌డ్రింక్ అనో భావించే వ్యక్తి జవహర్: మాజీ మంత్రి మాణిక్యాలరావు

  • ఇసుక మాయం కావడానికి జవహరే కారణం
  • ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ
  • జవహర్ భవిష్యత్ కొండెక్కే స్థితిలో ఉంది

బీరు తాగి.. దానిని మజ్జిగనో లేదంటే కూల్‌డ్రింక్ అనో భావించే వ్యక్తి మంత్రి జవహర్ అని మాజీ మంత్రి మాణిక్యాలరావు విమర్శించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జవహర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి తీరంలో ఇసుక మాయం కావడానికి జవహరే కారణమంటూ విరుచుకుపడ్డారు. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్టుగా జవహర్ భవిష్యత్ కొండెక్కే స్థితిలో ఉందని ఎద్దేవా చేశారు. దేశ ప్రధాని గురించి కానీ.. బీజేపీ గురించి కానీ మాట్లాడే అర్హత జవహర్‌కు లేదని.. తన స్థాయిని మరచి మాట్లాడొద్దని మాణిక్యాలరావు హెచ్చరించారు.

Manikyala Rao
Javahar
Narendra Modi
BJP
Beer
  • Loading...

More Telugu News