Uttar Pradesh: 178 యూనిట్లు వాడినందుకు రూ. 23 కోట్ల బిల్లు.. అవాక్కయిన వినియోగదారుడు

  • ఉత్తరప్రదేశ్‌లో ఘటన
  • రీడింగ్‌లో తప్పు జరిగిందన్న అధికారులు
  • మరోమారు రీడింగ్ తీసుకుంటామన్న అధికారులు

విద్యుత్ సిబ్బంది లీలకు ఇదో ఉదాహరణ. కేవలం 178 యూనిట్లు ఉపయోగించుకున్న ఓ వినియోగదారుడికి ఏకంగా రూ. 23 కోట్ల బిల్లు చేతిలో పెట్టి గుండె ఆగిపోయేలా చేశారు. బిల్లు చూసిన వినియోగదారుడు లబోదిబోమంటూ అధికారుల వద్దకు పరిగెడితే భయపడాల్సింది ఏమీ లేదని, కొన్నిసార్లు ఇటువంటి తప్పిదాలు జరుగుతూ ఉంటాయని చావు కబురు చల్లగా చెప్పారు.

ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌కు చెందిన అబ్దుల్ బాసిత్‌కు ఈ అనుభవం ఎదురైంది.  అతడి ఇంటికి రీడింగ్‌కు వచ్చిన విద్యుత్ సిబ్బంది రూ. 23,67,71,524 బిల్లును చేతిలో పెట్టి వెళ్లిపోయారు. అది చూసి బిత్తరపోయిన అబ్దుల్ వెంటనే అధికారుల వద్దకు పరుగులు పెట్టాడు. బిల్లు చూసిన అధికారులు చావు కబురు చల్లగా చెప్పారు.  కొన్నిసార్లు ఇటువంటి తప్పుడు బిల్లులు వస్తుంటాయని, మరేమీ భయపడాల్సిన అవసరం లేదని అభయమిచ్చారు. బిల్లును మారుస్తామని, మరోసారి రీడింగ్ తీసుకుంటామని చెప్పడంతో అబ్దుల్ షాక్ నుంచి తేరుకున్నాడు.

Uttar Pradesh
Kannauj
power bill
abdul basit
  • Loading...

More Telugu News