Andhra Pradesh: దొంగ దీక్షలకు ఎన్ని రోజులైనా అనుమతులు ఇస్తారు.. రాబోయేది పోయేకాలమే!: టీడీపీపై జీవీఎల్ ఆగ్రహం

  • ఏపీలో నిరంకుశ పాలన నడుస్తోంది
  • ప్రజల సొమ్ముతో జల్సాలు చేస్తున్నారు
  • ట్విట్టర్ లో స్పందించిన బీజేపీ నేత

ఆంధ్రప్రదేశ్ లో ప్రజా సమస్యలపై శాంతియుతంగా దీక్ష చేసే పరిస్థితి కూడా లేదని బీజేపీ అధికార ప్రతినిధి, పార్లమెంటు సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన రాజ్యమేలుతోందని దుయ్యబట్టారు. టీడీపీ నేత సీఎం రమేశ్ లాంటి వ్యక్తులు చేసే దొంగ దీక్షలకు ఎన్ని రోజులయినా అనుమతిస్తారని ప్రభుత్వంపై మండిపడ్డారు. దీక్షల పేరుతో ప్రజల సొమ్ముతో జల్సా చేసుకుంటున్నారనీ, రాబోయేది పోయే కాలం అనడానికి ఇదే సూచన అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు జీవీఎల్ ట్విట్టర్ లో స్పందించారు.

రాష్ట్రంలో అవినీతిపరులను కాపాడేందుకు టీడీపీ ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలను అనుసరిస్తోందని ఆయన ఆరోపించారు. జగన్ పై దాడి కేసును ఎన్ఐఏ విచారించకూడదనీ,  ఏపీలో అవినీతిపై సీబీఐ విచారణ చేయకూడదనీ, పన్నుఎగవేతదారులపై ఐటీ శాఖ దాడులు చేయకూడదని చంద్రబాబు చెబుతున్నారని విమర్శించారు. బీజేపీ నేత మాణిక్యాల రావు చేపట్టిన దీక్షను ఏపీ పోలీసులు నిన్న భగ్నం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జీవీఎల్ విమర్శలు గుప్పించారు.

  • Loading...

More Telugu News