Abhishek Bachchan: హీరోగా చేసిన నేనిప్పుడు సైడ్ క్యారెక్టర్ అయిపోయాను... గుండెల్ని పిండేస్తోందన్న అభిషేక్ బచ్చన్!

  • సహాయ నటుడిగా చేయాలంటే చాలా కష్టం
  • రోజులు గడుస్తుంటే పరిస్థితి మారిపోతుంది
  • 'కాఫీ విత్ కరణ్'లో అభిషేక్

ఎన్నో సంవత్సరాల పాటు హీరోగా నటించి, రాణించిన నటుడు ఇప్పుడు సహాయ నటుడి పాత్రలను పోషించడం గుండెలను పిండేసే విషయమని అమితాబ్ బచ్చన్ తనయుడు, బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన 'కాఫీ విత్ కరణ్' కార్యక్రమంలో పాల్గొన్నారు. గత సంవత్సరం సెప్టెంబర్ లో తాను సైడ్ క్యారెక్టర్ చేసిన 'మన్మర్జియా' చిత్రం ప్రస్తావనకు వచ్చిన వేళ, అభిషేక్ ఈ వ్యాఖ్యలు చేశారు.

హీరోగా చేసే వారు సైడ్ క్యారెక్టర్ గా చేయాల్సి రావడం చాలా కష్టమైన విషయమని, సినీ ఇండస్ట్రీ చాలా దారుణమైన ప్రదేశమని అన్నారు. ఇక్కడ ఎవరికీ ఏదీ సొంతం కాదని, రోజులు గడుస్తుంటే పరిస్థితి మారిపోతుందని అన్నారు. ఆ బాధ నుంచే స్ఫూర్తి పొందాలని, తిరిగి సెంటర్ లోకి వచ్చేందుకు కృషి చేయాలని అన్నాడు.

Abhishek Bachchan
Coffee with Karan
Hero
Side Charecter
  • Loading...

More Telugu News