Andhra Pradesh: మాజీ మంత్రి మాణిక్యాలరావు దీక్ష భగ్నం

  • ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిందే
  • ప్రభుత్వం మెడలు వంచి హామీలు నెరవేర్చుకుంటాం
  • పోలీసులు తరలించేముందు మాణిక్యాలరావు

పశ్చిమ గోదావరి జిల్లాకు 56 హామీలను ఇచ్చిన చంద్రబాబునాయుడు, వాటిని తక్షణం నెరవేర్చాలంటూ తాడేపల్లి గూడెంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే మాణిక్యాలరావు చేపట్టిన దీక్షను పోలీసులు గత రాత్రి భగ్నం చేశారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్న దృష్ట్యా, పోలీసులు దీక్షను భగ్నం చేసి ఆసుపత్రికి తరలించారు. మంగళవారం నాడు ఆయన రెండో రోజు దీక్ష చేస్తుండగా, రాత్రి వేళ దీక్షా వేదిక వద్దకు వచ్చిన పోలీసులు, ఆయన్ను బలవంతంగా తీసుకెళ్లారు.

 ఈ సందర్భంగా మాణిక్యాలరావు మాట్లాడుతూ, తానిచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేయాల్సిందేనని, ఇచ్చిన హామీలు అమలు కాకపోతే తాను దేనికైనా సిద్ధమేనని హెచ్చరించారు. ప్రభుత్వం మెడలు వంచి హామీలు నెరవేర్చుకుంనేందుకు తాను ఆసుపత్రిలోనే దీక్షను కొనసాగిస్తానని అన్నారు.

Andhra Pradesh
West Godavari District
Manikyalarao
Hunger Strike
  • Loading...

More Telugu News