Akhil Akkineni: ‘మిస్టర్ మజ్ను’ టైటిల్ ప్రోమో సాంగ్ విడుదల

  • వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘మిస్టర్ మజ్ను’
  • సినిమాపై భారీ అంచనాలు
  • పాట కోసం చాలా కష్టపడ్డానన్న అఖిల్

  అఖిల్ అక్కినేని హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ‘మిస్టర్ మజ్ను’ సినిమా ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో సినిమాపై అంచనాలు కూడా భారీగానే పెరిగాయి. తాజాగా ఈ చిత్రంలోని ‘దేవదాసు మనవడు.. మన్మధుడికి వారసుడు..’ అంటూ సాగే టైటిల్ ప్రోమో సాంగ్ విడుదలైంది.

ఈ పాటకు సంబంధించిన వీడియో లింక్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసిన అఖిల్ ‘ఈ పాట కోసం చాలా కష్టపడ్డాను. నాకు మద్దతు తెలిపిన చాలా మందికి ధన్యవాదాలు. కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ మాస్టర్, ఆర్ట్‌ డైరెక్టర్‌ అవినాశ్‌, సినిమాటోగ్రాఫర్‌ జార్జికి ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్పాలి’ అని పోస్ట్ పెట్టాడు. ఈ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Akhil Akkineni
Venky Atluri
Mr. majnu
Social Media
Sekhar Master
  • Loading...

More Telugu News