Rajamouli: రాజమౌళి సినిమా డిజిటల్, శాటిలైట్ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసిన ప్రముఖ ఛానల్!

  • ‘బాహుబలి’తో అంతర్జాతీయ ఖ్యాతి
  • ఆకాశాన్నంటుతున్న అంచనాలు
  • రూ.132 కోట్లకు అమ్ముడైన శాటిలైట్ హక్కులు

టాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడు రాజమౌళి సినిమాకు ఉన్నంత క్రేజ్ మరే దర్శకుడి సినిమాకు ఉండదు. ‘బాహుబలి’ సినిమాతో అంతర్జాతీయ స్థాయి ఖ్యాతిని ఆయన సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆయన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో భారీ మల్టీస్టారర్‌ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం నిన్నటి నుంచే సెకండ్ షెడ్యూల్‌ను ప్రారంభించింది.

అసలే రాజమౌళి సినిమా అంటే అంచనాలు భారీగా ఉంటాయి... అలాంటిది ఆయనకు మరో ఇద్దరు స్టార్ హీరోలు కూడా తోడవడంతో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో ఈ సినిమా హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడినట్టు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్, శాటిలైట్ హక్కులను ఓ ప్రముఖ ఛానల్ రూ.132 కోట్లకు కొనేసిందని ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Rajamouli
Junior NTR
Ramcharan
Bahubali
Sattilite rights
  • Loading...

More Telugu News