bal thackeray: థాకరే మెమోరియల్ కు 100 కోట్లు కేటాయించిన మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వం

  • నిధుల కేటాయింపుకు మహరాష్ట్ర కేబినెట్ ఆమోదం
  • బీజేపీ, శివసేనల మధ్య సత్సంబంధాలు ఉంటాయన్న మంత్రి సుధీర్
  • తమ పొత్తుకు బాల్ థాకరేనే నాయకుడన్న సీనియర్ నేత

లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న సమయంలో శివసేనను ఆకట్టుకునేందుకు బీజేపీ తన వంతు యత్నాలను ముమ్మరం చేసింది. శివసేన వ్యవస్థాపకుడు, దివంగత బాల్ థాకరే మెమోరియల్ నిర్మాణం కోసం రూ. 100 కోట్ల నిధులకు ఆమోదం తెలిపింది. కేబినెట్ సమావేశం అనంతరం మహారాష్ట్ర ఆర్థిక మంత్రి సుధీర్ మాట్లాడుతూ... బీజేపీ, శివసేనల మధ్య ఎప్పటిలాగానే సత్సంబంధాలు ఉంటాయని అన్నారు. మిత్రులకు అనుకూలంగానే బీజేపీ ఉంటుందని... ఇరు పార్టీల మధ్య పొత్తు ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పారు.

బాల్ థాకరే కేవలం శివసేన నాయకుడు మాత్రమే కాదని... తమ పొత్తుకు కూడా ఆయనే నాయకుడని సుధీర్ అన్నారు. అన్ని పార్టీలకు బాల్ థాకరేపై గౌరవం ఉందని... అందుకే ఆయన మెమోరియల్ కోసం రూ. 100 కోట్లను నేటి కేబినెట్ లో ఆమోదించామని చెప్పారు.

bal thackeray
bjp
shiv sena
memorial
funds
  • Loading...

More Telugu News