Andhra Pradesh: చంద్రబాబు నమ్మి సీటు ఇచ్చారు.. ఆయన గర్వపడేలా పనిచేస్తా!: జలీల్ ఖాన్ కుమార్తె

  • విజయవాడ వెస్ట్ సీటును ఇచ్చిన సీఎం
  • ధన్యవాదాలు తెలిపిన షబానా ఖాతూర్
  • చంద్రబాబు విజన్ అంటే ఇష్టమని వ్యాఖ్య

విజయవాడ వెస్ట్ అసెంబ్లీ సీటును తనకు కేటాయించినందుకు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కుమార్తె షబానా ఖాతూర్ ఏపీ సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవకాశం ఇచ్చినందుకు టీడీపీ అధినేత గర్వపడేలా పనిచేస్తానని వ్యాఖ్యానించారు. తాను నాన్న జలీల్ ఖాన్ అడుగుజాడల్లో నడుస్తానని అన్నారు. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలుసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు.

తనను నమ్మి సీటు ఇచ్చిన ముఖ్యమంత్రి సంతోషపడేలా పనిచేస్తానని షబానా అన్నారు. తాను చంద్రబాబుకు పెద్ద ఫ్యాన్ అనీ, ఆయన విజన్ నచ్చడంతోనే టీడీపీలో పనిచేసేందుకు ముందుకు వచ్చానని పేర్కొన్నారు. టీడీపీ అధినేత ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని చెప్పారు.

Andhra Pradesh
Chandrababu
Telugudesam
jaleel khan
daughter
Vijayawada west
  • Loading...

More Telugu News