devadas kanakala: నేను ఇబ్బందులు పడుతున్నానని తెలిసి రజనీకాంత్ మా ఇంటికి వచ్చాడు: దేవదాస్ కనకాల

  • దర్శకత్వం వైపు వెళ్లి ఇబ్బందులు పడుతున్నాను
  • స్టూడియోకి వెళ్లి రజనీకాంత్ ను కలిశాను
  • వద్దు .. ఉన్నది చాలు అని చెప్పాను       

తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ప్రముఖ నటుడు .. దర్శకుడు దేవదాస్ కనకాల మాట్లాడుతూ, ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. "చిరంజీవి .. రజనీకాంత్ .. రాజేంద్ర ప్రసాద్ నటనకి సంబంధించి నా స్టూడెంట్స్. నేను నటన వైపు నుంచి దర్శకత్వం వైపు వెళ్లాను .. అప్పుడు నేను కొంచెం ఇబ్బందులు పడ్డాను. నేను ఇబ్బందులు పడుతోన్న సంగతి రజనీకాంత్ కి తెలిసి మా ఇంటికి వచ్చాడు. నేను ఆ సమయంలో లేకపోవడంతో, తను ఫలానా స్టూడియోలో ఉంటానని మా శ్రీమతితో చెప్పేసి వెళ్లిపోయాడు.

నేను ఇంటికి రాగానే మా ఆవిడ చెప్పగానే ప్రసాద్ స్టూడియోకి వెళ్లి రజనీకాంత్ ని కలిశాను. "మాస్టారూ నేను డేట్స్ ఇస్తాను సినిమా తీసుకోండి .." అన్నాడు నాకు సాయం చేయాలనే ఉద్దేశంతో. నాకు తమిళ్ రాదు .. అందువలన నేను తమిళ సినిమా చేయలేను. కనుక నువ్విచ్చే డేట్స్ నేను ఎవరికైనా అమ్ముకోవాలి. ఆ పని నేను చేయలేను .. ఉన్నదేదో చాలు .. నా శక్తి మేరకు పోరాడుతూనే వుంటాను అని ఆయనకి సున్నితంగా చెప్పాను" అని అన్నారు. 

devadas kanakala
ali
  • Loading...

More Telugu News