Kamal Haasan: దావోస్ లో బీజేపీపై విరుచుకుపడ్డ కమలహాసన్
- 10 శాతం రిజర్వేషన్ల పేరుతో అగ్రకులాలను ఫూల్ చేస్తోంది
- రైతులను వెర్రివాళ్లను చేస్తోంది
- దేశ ప్రజలను బుద్ధి హీనులుగా చూస్తోంది
ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమలహాసన్ దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలకు హాజరయ్యారు. ఇందులో భాగంగా అక్కడ జరిగిన దావోస్ మేధోమథనం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బీజేపీపై మండిపడ్డారు. దేశ ప్రజలను బీజేపీ బుద్ధి హీనులుగా చూస్తోందని విమర్శించారు. అగ్రకుల పేదలకు 10 శాతం రిజర్వేషన్ల పేరుతో వారిని ఫూల్ చేస్తోందని అన్నారు. రైతులను వెర్రివాళ్లను చేస్తోందని దుయ్యబట్టారు. ఓటర్లను పిచ్చివాళ్లను చేయడానికి మోదీ సర్కార్ యత్నిస్తోందని విమర్శించారు. మధ్యప్రదేశ్ లో ఐదుగురు ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ యత్నించిందని ఆరోపించారు.